ఛావా కోసం ఎన్టీఆర్.. గూస్ బంప్స్ గ్యారెంటీ!
on Feb 26, 2025

ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా 'ఛావా'. విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. పాన్ ఇండియా భాషలలో కాకుండా, కేవలం హిందీలోనే విడుదలైనప్పటికీ.. వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని.. తెలుగుతో పాటు అన్ని భాషల ప్రేక్షకులు కోరుతున్నారు. (Jr NTR for Chhaava)
'ఛావా'ను త్వరలోనే పాన్ ఇండియా భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, విక్కీ కౌశల్ పోషించిన శంభాజీ పాత్రకు డబ్బింగ్ చెప్పడం కోసం ఆయా భాషలకు చెందిన స్టార్స్ ని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. తెలుగు వెర్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతున్నట్లు వినికిడి.
ఎన్టీఆర్ వాయిస్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ బేస్ వాయిస్ తో డైలాగ్స్ చెప్తే.. గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి ఎన్టీఆర్.. చారిత్రాత్మక పాత్ర శంభాజీకి డబ్బింగ్ చెప్తే.. ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో మాటల్లో చెప్పలేము.
'ఛావా' తెలుగు వెర్షన్ మార్చి 7న విడుదలయ్యే అవకాశముంది. తెలుగులో గీతా ఆర్ట్స్ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో కన్నడ బ్లాక్ బస్టర్ 'కాంతార'ను తెలుగులో విడుదల చేసి, మంచి లాభాలను చూసింది గీతా ఆర్ట్స్. ఇప్పుడు 'ఛావా'తో కూడా అదే రిపీట్ చేస్తుందేమో చూడాలి.
గీతా ఆర్ట్స్ అంటే తెలుగునాట భారీ విడుదల ఉంటుంది అనడంలో సందేహం లేదు. దానికి తోడు, తెలుగు వెర్షన్ కి నిజంగానే ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తే మాత్రం.. ఈ సినిమా తెలుగునాట సంచలన వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



