నీల్ కోసం 45 రోజులు.. ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడు..?
on Nov 19, 2025

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'(Dragon). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్.. కొంత భాగం షూటింగ్ జరుపుకున్న తర్వాత బ్రేక్ వచ్చింది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని, అందుకు తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పుల కోసమే బ్రేక్ తీసుకున్నారని వార్తలొచ్చాయి. (NTR Neel)
డ్రాగన్ మూవీ షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందా? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే వారి ఎదురుచూపులు ఫలించబోతున్నట్లు తెలుస్తోంది.
డ్రాగన్ షూటింగ్ డిసెంబర్ 1న రీ స్టార్ట్ కానుందట. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ చిత్ర షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఏకంగా 45 రోజులు కేటాయించబోతున్నట్లు సమాచారం.
డిసెంబర్ 1 నుంచి 24 వరకు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక షెడ్యూల్ జరగనుందట. అలాగే, జనవరి 5 నుంచి 25 వరకు విదేశాల్లో మరో షెడ్యూల్ జరగనుందట. ఈ రెండు షెడ్యూల్స్ కలిపి ఎన్టీఆర్ ఏకంగా 45 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు వినికిడి.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ న్యూస్.. సందీప్ రెడ్డి మాట నిలబెట్టుకుంటాడా?
డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేశాడట. కేజీఎఫ్, సలార్ ని మించిన ఎలివేషన్స్, ఎమోషన్స్ ఉంటాయని అంటున్నారు.
నెక్స్ట్ రెండు షెడ్యూల్స్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. డ్రాగన్ సినిమాలో మేజర్ హైలైట్స్ లో ఒకటిగా ఇవి నిలుస్తాయని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, డ్రాగన్ లో తమిళ సీనియర్ యాక్టర్ నాజర్ ఒక కీలక పాత్ర చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆ పాత్రకి సంబంధించి కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ రష్ ని పక్కన పెట్టి, నాజర్ స్థానంలో మలయాళ యాక్టర్ బిజు మీనన్ ని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



