పవన్ పై జయసుధ కామెంట్లు
on Mar 13, 2014

పవన్ కళ్యాణ్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడని, కొత్తగా జనసేన అనే పార్టీని స్థాపించి రాజకీయ ప్రవేశం చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై నటి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధ స్పందిస్తూ... "ప్రజలకు ఏదైనా సేవా చేయాలని భావిస్తే రాజకీయాల్లోకి ఎవ్వరైనా రావచ్చు. కానీ పవన్ రాజకీయాల్లోకి ఇపుడు రావడం సరైనది కాదని నా అభిప్రాయం. తన సోదరుడు చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీని నెలకొల్పి కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడే పవన్ కొత్త పార్టీని ఏర్పాటు చేసి ఉండాల్సింది. అప్పుడే పవన్ ఏదైనా చేసుంటే బాగుండేది. కానీ పవన్ కు ఉన్న భారీ ఫాలోయింగ్ కారణంగా అతను ఏమైనా చేయగలడు. కానీ ఓటమి ఎదురైతే ఆ పోరాటాన్ని మధ్యలోనే ఆపకుండా కొనసాగించాలని నా అభిప్రాయం" అని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



