జానీ మాస్టర్ కి బిగ్ షాక్.. నేషనల్ అవార్డు రద్దుపై భిన్నాభిప్రాయాలు!
on Oct 6, 2024

డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి ప్రకటించిన జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ తెలిపింది. తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో.. జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ కి ప్రకటించిన అవార్డుని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు సెల్ పేర్కొంది.
2022 ఏడాదికిగానూ 'తిరుచిత్రంబలం' చిత్రానికి జానీ మాస్టర్ కి జాతీయ అవార్డుని ప్రకటించారు. అక్టోబర్ 8న అవార్డు అందుకోవాల్సి ఉండగా.. ఈ వేడుకకు హాజరు కావడానికి కోర్టు కూడా ఐదు రోజుల మధ్యంతర బెయిల్ ని ఇచ్చింది. కానీ అనూహ్యంగా జానీ మాస్టర్ కి ప్రకటించిన అవార్డుని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించి నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ షాకిచ్చింది. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్దిస్తుండగా, మరికొందరు మాత్రం ప్రతిభను వ్యక్తిగత జీవితంతో ముడి పెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



