మధురానగర్ హనుమాన్ కి జాన్వీకపూర్ పూజలు చెయ్యడానికి కారణం ఏంటి?
on Nov 7, 2024

ఎన్టీఆర్(ntr)హీరోగా లేటెస్ట్ గా రిలీజైన దేవర(devara)తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్(janhvi kapoor)ఆ మూవీలో పెర్ఫార్మెన్సు పరంగా, డాన్స్ ల పరంగా సూపర్ గా చేసి తన తల్లి శ్రీదేవి కి తగ్గ వారసురాలని ప్రేక్షకుల చేత అనిపించుకుంది.
జాన్వీ కపూర్ లేటెస్ట్ గా హైదరాబాద్ లోని మధురానగర్ ఏరియాలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి విచ్చేసి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఆలయంలోనే ఉన్న శివ లింగానికి కూడా తన చేతుల మీదుగానే అభిషేకం చేసింది. ఈ మేరకు ఆలయ పూజారులు జాన్వీ కపూర్ కి దగ్గరుండి మరి ఆహ్వానించి పూజా కార్యక్రమాల అనంతరం తీర్ధ ప్రసాదాలు అందచేశారు.ఇక జాన్వీ వచ్చిన విషయం తెలుసుకున్న చాలా మంది అభిమానులు ఆలయం దగ్గరకి విచ్చేసి ఆమెతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు.
జాన్వీ ప్రస్తుతం దేవర పార్ట్ 2 తో పాటు ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు(buchhi babu)దర్శకత్వంలో రామ్ చరణ్(ram charan)చేస్తున్న కొత్త మూవీ లోను హీరోయిన్ గాను చేస్తుంది. ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యి జాన్వీ మీద కొంత టాకీ పార్ట్ కూడా చిత్రీకరించడం జరిగింది
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



