అతనితో నిజాయితీగా ఉన్నానంటున్న అవతార్ డైరెక్టర్..ఆర్ఆర్ఆర్ టీం గర్వం
on Feb 7, 2024

సినిమాకి, సినిమాని చూసేవాళ్ళకి జేమ్స్ కామెరూన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దశాబ్దాలకిందటే 20 సంవత్సరాలు ముందు ఆలోచించి ఆయన సినిమాలు తెరకెక్కించేవారంటే కామెరూన్ దర్శక ప్రతిభ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచ సినీ పితామహుడిగా పిలవబడే ఆయన నుంచి టైటానిక్, టెర్మినేటర్, అవతార్ లాంటి ఫ్యూచర్ తరాన్ని ఆవిష్కరిస్తు ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాంటి ఆయన ఆర్ఆర్ఆర్ గురించి వ్యాఖ్యానించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు సినిమా అయ్యింది.
తాజాగా ఆమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో 51వ సాటర్న్ అవార్డ్స్ వేడుకలు జరిగాయి ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో జేమ్స్ కామెరూన్ కూడా పాల్గొన్నారు.ఆ సమయంలో ఆయన తెలుగు సినిమా గర్వించే మాటలని చెప్పారు.నేను గ్లోబల్ అవార్డ్స్ ఫంక్షన్లో రాజమౌళిని కలిసినప్పుడు నేను నిజాయితీగా ఉన్నాను. ఆ కలయిక అధ్బుతమైనదిగా నేను భావిస్తున్నాను అని అన్నారు. అలాగే భారతీయ సినిమా ప్రపంచ వేదికపైకి రావడం కూడా చాలా గొప్పగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ గురించి యాంకర్ అడిగినప్పుడు ఆయన ఆ విధంగా ఆర్ ఆర్ ఆర్ టీంపై ప్రశంసల్ని కురిపించాడు.
కాగా సోషల్ మీడియా ద్వారా జేమ్స్ కామెరూన్ చెప్పిన మాటలు విన్న ఆర్ఆర్ఆర్ టీం సంతోషంతో ఉబ్బితబ్బివతుంది.ఆయన నోటి నుంచి వచ్చిన విలువైన మాటలకి మేము చాలా గర్వపడుతున్నామని చెప్పారు. అలాగే భారతీయ సినిమా అంతర్జాతీయంగా తన ఖ్యాతిని మరింత గొప్పగా చాటుతుందని కూడా ఆర్ఆర్ఆర్ టీం సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



