కాపీ కొట్టిన ట్రైన్ ముద్దు... రివర్స్‌లో అదుర్స్
on Sep 5, 2018
టాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమలకు సంబంధించి ఎదైనా కొత్త సినిమా మొదలైందంటే ప్రేక్షకులు ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయి కళ్లతో ఎదురుచూస్తారు. ఇక ఫస్ట్ లుక్ రిలీజైన తర్వాత వారికి నచ్చిన ఆ లుక్‌లో వారు పరకాయ ప్రవేశం చేసేస్తారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.... రీసెంట్ గా 'జలేబి' అనే హిందీ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు. ఆ ఫస్ట్ లుక్‌లో హీరో వరుణ్ మిత్రాకు హీరోయిన్ రియా చక్రబర్తి ట్రైన్ ఎమెర్జెన్సి విండో నుండి కిందకు వాలి గాలిలో లిప్ లాకు ఇచ్చింది. అది ఎలా ఉంది అంటే ఇక అన్నీ రైల్వే స్టేషన్స్ ఫ్యూచర్ లో ఇలాంటి ముద్దులతో మారిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. ఇటీవల హీరోయిన్ రకుల్ సరదాగా చేసిన కికి ఛాలెంజ్‌ను అందరూ ఫాలో అయ్యారు. ఇప్పుడు ఈ లిప్ లాక్‌ని కూడా యూత్ ఫాలో అవ్వకుండ మాత్రం ఎలా వుంటారు చెప్పండి. ఇదీలా వుంటే అసలు డైరెక్టర్‌కి ఇలాంటి లిప్ లాక్ సీన్ ఐడియ ఎలా వచ్చింది అని కొంత మంది సినీ ప్రముఖులు అరా తీశారు. వారి పరిశోదనలో భాగంగా అసలు విషయం బయట పడింది.
ఆ అసలు నిజం ఏమిటంటే... 1950లో కొరియా వార్ సందర్భంగా సోల్జర్ రాబర్ట్ మేయి ట్రయిన్ ఎక్కిన తర్వాత తన భార్య గ్లోరియాకి ట్రయిన్ విండో నుంచి కిస్ ఇచ్చినప్పుడు ‘లాస్ ఏంజిల్స్ టైమ్స్’ ఫోటోగ్రాఫర్ ఫ్రాంక్బ్రౌన్ క్లిక్ మనిపించాడు. దాని ఆధారంగా యాజ్ టీజ్ కిస్ సీన్ కాకుండా ‘జలేబి’పోస్టర్లో హీరోయిన్ ట్రయిన్ విండో నుంచి హీరోకి కిస్ ఇచ్చేటట్లు డిజైన్ చేసింది చిత్ర యూనిట్. ఎదీ ఎమైనా ఓ రకంగా యవతరాన్ని థియేటర్లకు రప్పించడంలో ఈ మురిపాల ముద్దులు దర్శకనిర్మాతలకు ఓ బంగారు బాతుల్లా మారాయి. ఇక ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా రిలీజ్ చేయటానికి సిద్ధంగా వున్నారు దర్శక నిర్మాతలు.