ప్రేమ... పెళ్ళి... అంజలి మాటేమిటి?
on May 20, 2019

తమిళ నటుడు జైతో అంజలి ప్రేమలో ఉందని కొన్నాళ్ల క్రితం వరకూ కోలీవుడ్, టాలీవుడ్ కోడై కూసింది. అందుకు తగ్గట్టుగా ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు. అంజలి కోసం జై దోశలు కూడా వేశారు. ఏమైందో ఏమో... ఇద్దరి మధ్య చెందిందని, బ్రేకప్ అయిందని వార్తలు వచ్చాయి. 'లీసా' ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన అంజలి ఈ విషయంపై పెదవి విప్పారు. "నేను ఎప్పుడూ ప్రేమలో ఉన్నానని చెప్పలేదు. నేను చెప్పని విషయాలపై స్పందించను. నేను స్పందించడం లేదంటే... నేను ఏమీ ప్రకటించలేదని అర్థం" అని జైతో లవ్, బ్రేకప్ గురించి అంజలి వ్యాఖ్యానించారు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం సోదరుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. బ్రదర్‌కి పెళ్లి అయిన తరవాత తాను పెళ్లి చేసుకుంటానన్నట్టు అంజలి మాట్లాడారు. పెళ్లి తరవాత కచ్చితంగా నటించవచ్చని, ప్రేక్షకుల ఆలోచించే తీరులో మార్పు వచ్చిందన్నారామె. సో.. పెళ్లి తరవాత అంజలి నటిస్తారని ఊహించవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



