గూస్ బంప్స్ తెప్పించేలా 'జై శ్రీరామ్' సాంగ్!
on May 20, 2023

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరామునిగా కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. టి.సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్న ఈ సినిమా జూన్ 16న విడుదల కానుంది. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి 'జై శ్రీరామ్' సాంగ్ విడుదలైంది.
'ఆదిపురుష్' నుంచి తాజాగా విడుదలైన 'జై శ్రీరామ్' ఫుల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. "ఎవరు ఎదురు రాగలరు మీ దారికి.. ఎవరికి ఉంది ఆ అధికారం?.. పర్వత పాదాలు వణికి కదులుతాయ్ మీ హుంకారానికి" అంటూ శ్రీరాముడిగా ప్రభాస్ చెప్పే మాటలతో పాట ప్రారంభమైంది. "నీ సాయం సదా మేమున్నాం సిద్ధం సర్వ సైన్యం.. సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం" అంటూ సాగిన పాట గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అజయ్-అతుల్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం చక్కగా కుదిరాయి. విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ట్రైలర్, 'జై శ్రీరామ్' సాంగ్ 'ఆదిపురుష్'పై అంచనాలు పెరిగేలా చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



