ENGLISH | TELUGU  

సలార్ తో జగపతిబాబు మరో మెట్టు ఎక్కబోతున్నాడా!

on Nov 2, 2023


 

'సలార్' సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఒక పెను సంచలనం అవుతుందని ఇప్పటికే మూవీ మేకర్స్ ఒక బజ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక పండగే అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో జగపతి బాబు నటిస్తున్నాడనే విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. హీరో, హీరోయిన్ లకే కాదు విలన్లకి ఫ్యాన్స్ ఉంటారు. అవును నిజమే.. సోను సూద్ సినిమాలల్లో విలన్ రోల్స్ ఎక్కువ చేస్తాడు. కానీ బయట మంచి పనులు చేస్తూ అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అదే కోవలోకి జగపతి బాబు చేరాడు. 

తొంభైల్లో అతని సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఫాదర్ రోల్స్, గెస్ట్ రోల్ ఇలా మెల్లి మెల్లిగా విలన్ రోల్స్ చేశాడు. ఇక నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవలో ఇతని నటనకి ఇండస్ట్రీతో పాటు అందరు ప్రశంసలు కురిపించారనే చెప్పాలి. జగపతి బాబు తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారాలను అందుకున్నాడు జగపతి బాబు. కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించాడు. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా పేరు గాంచినా కొన్ని సినిమాలతో ప్రయోగాలు కూడా చేశాడు. ఉదాహరణకు గాయం, అంతఃపురం, లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో అతను పోషించిన పాత్రలు విలక్షణంగా కనిపిస్తాయి.

జగపతిబాబు తన యాక్టింగ్ తో వేలాది మంది అభిమానులని సంపాదించుకున్నాడు. అయితే అందరు ఇతడిని జగ్గుభాయ్ అంటారు. అయితే తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ చేసి వార్తల్లో నిలుస్తుంటాడు జగ్గు భాయ్. ఇప్పుడు సలార్ మూవీలో నటిస్తున్నట్టుగా ఒక క్లూ ఇచ్చాడు. 'సలార్ తో ఇంకో మెట్డు ఎక్కబోతున్నాను' అంటూ షేర్ చేశాడు. మరి జగపతిబాబు విలన్ గా చేస్తున్నాడా లేక సపోర్టింగ్ రోల్ చేస్తున్నాడా అని తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు జగపతిబాబు పోస్ట్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.