ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ నటుడు!
on Jun 12, 2023

జబర్దస్త్ టీవీ షోలో లేడీ గెటప్స్ వేసి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న హరి.. మళ్ళీ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాడు. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులో అక్రమంగా తరలిసున్న రూ.60 లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక హరి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు అతనికి పలువురు స్మగ్లర్లతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం హరి పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
గతంలోనూ పలుసార్లు ఎర్రచందనం స్మగ్లింగ్ లో హరి పేరు వినిపించింది. అతనిపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. కేసులు నమోదైనా, అరెస్ట్ అయినా అతని తీరులో మార్పు రావడంలేదు అంటున్నారు. జబర్దస్త్ ద్వారా వచ్చిన అంతో ఇంతో పేరు తెచ్చుకొని, పలు సినిమాల్లోనూ ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ పదే పదే ఎర్రచందనం స్మగ్లింగ్ లో అతని పేరు వినిపిస్తుండటంతో.. ఇక నటుడిగా అతని కెరీర్ కి ఫుల్ స్టాప్ పడినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



