తల్లి పాత్రలో నాలుగు హిట్స్ చూసిన శ్రియ.. మరోసారి మెప్పించేనా!
on Dec 9, 2021

వెండితెరపై 20 ఏళ్ళుగా వెలుగులు పంచుతోంది ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రియా శరన్. దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ ఆడిపాడిన శ్రియ.. గత కొంతకాలంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకే ఓటేస్తోంది. ఈ క్రమంలోనే.. `గమనం`, `ఆర్ ఆర్ ఆర్` చిత్రాల్లో నిడివితో సంబంధం లేకుండా అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో నటించింది శ్రియ. తక్కువ గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు తెరపైకి రాబోతున్నాయి. రేపు (డిసెంబర్ 10) `గమనం` థియేటర్స్ లోకి రానుండగా.. జనవరి 7న `ఆర్ ఆర్ ఆర్` సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. నిజజీవితంలో ఇటీవలే అమ్మ అయిన శ్రియ.. ఈ రెండు సినిమాల్లోనూ తల్లి పాత్రల్లోనే దర్శనమివ్వనుంది.
అయితే, శ్రియ తల్లిగా నటించడం ఇదే తొలిసారి కాదు. `మనం`, `గోపాల గోపాల`, `దృశ్యం` (హిందీ), `గౌతమీపుత్ర శాతకర్ణి` వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో అమ్మగా అభినయించింది. అంతేకాదు.. ఆ నాలుగు చిత్రాలతోనూ విజయాలు అందుకుంది. ఈ నేపథ్యంలో.. `గమనం`, `ఆర్ ఆర్ ఆర్` సినిమాల్లోనూ శ్రియ అమ్మ పాత్రల్లో అలరించి మరో రెండు హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



