కాపీ కి కేరాఫ్ అడ్రస్ రాజమౌళి
on May 2, 2015
.jpg)
బాహుబలి చిత్రీకరణ ప్రారంభమైన నాటినుంచి వివాదాలతో సావాసం చేస్తున్న రాజమౌళి మళ్లీ అబాసుపాలయ్యాడు. నీటిలోంచి బయటకు పెట్టి ఉన్న చేతిలో పసికందుని పెట్టిన ఫొటోను ఫస్ట్ లుక్ గా విడుదల చేశాడు. అయితే జక్కన్న ఈ లుక్ ఇలా రిలీజ్ చేశాడో లేదో అప్పుడే అదెక్కడి నుంచి కాపీ కొట్టాడో తేల్చేశారు. 1988లో వచ్చిన సైమన్ బిర్స్ అనే హాలీవుడ్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఇదే అని స్పష్టమవుతోంది. అయితే హాలీవుడ్ మూవీ పోస్టర్లో రెండు చేతులు బయట పెట్టినట్టు ఉంటే...బాహుబలి పోస్టర్లో ఒక్క చేయి బయటపెట్టి ఉంది. గతంలో బాహుబలి టీజర్ విషయంలోనూ ఇదే జరిగింది. మరి కాపీ అంటే అంతెత్తున ఎగిరే రాజమౌళి ఈ పోస్టర్ పై ఏం సమాధానం చెబుతాడో వెయిట్ అండ్ సీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



