భారతీయుడు సీక్వెల్లో అజిత్
on Jun 26, 2018
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'భారతీయుడు' సినిమా ఓ సంచలం.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండే అతి తక్కువ సినిమాలలో భారతీయుడు కూడా ఒకటి.. అలాంటి భారతీయుడు సినిమాకి సీక్వెల్ వస్తుందంటే ప్రేక్షకులు ఎంత ఆనందపడతారు.. ఆమధ్య భారతీయుడు సీక్వెల్ అంటూ చాలా వార్తలొచ్చాయి.. ఇప్పుడు భారతీయుడు సీక్వెల్ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.. ప్రస్తుతం 2 .ఓ తో బిజీగా ఉన్న శంకర్ వచ్చే ఏడాది భారతీయుడు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడట.. అయితే ఈసారి భారతీయుడిగా కమల్ బదులు అజిత్ నటించే అవకాశం ఉందట.. ప్రస్తుతం కమల్ సినిమాలతో పాటు రాజకీయాల మీద దృష్టి పెట్టాడు.. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కమల్ అందుబాటులో ఉండడు.. అందుకే శంకర్, అజిత్ తో భారతీయుడు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడట.. ఇదే జరిగితే అజిత్ ని భారతీయుడిగా చూస్తాం అనమాట.. చూద్దాం భారతీయుడిగా అజిత్ ఎంతలా ఆకట్టుకుంటాడో.