ఐ లవ్ యూ చెప్పిన ఇలియానా
on Jul 21, 2014
ఇలియానా ప్రేమలో పడింది అని గాసిప్పులు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఆ గుసగుసలకు ఇలియాన తెర దింపింది. ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ఇలియానా ప్రేమలో పడింది అంటూ వస్తున్న వార్తలను ఆమె స్వయంగా అంగీకరించింది.
ఎలాంటి అబ్బాయిని అమ్మాయిలు ఇష్టపడతారంటూ సోషల్ మీడియాలో ఒకరు ఆండ్రూని ప్రశ్నించారు. చక్కటి కాఫీ పెట్టి, నచ్చేలా భోజనం వండి, ఒంటి చేత్తో పుషప్స్ చేయగల మగవాడంటే ఆడవాళ్లకి ఇష్టమని ఆండ్రూ జవాబిచ్చాడు. దీనికి ప్రశ్న అడిగిన వారు ఏమన్నా, ఇలియానా మాత్రం అందుకేగా నిన్ను నేను ప్రేమిస్తోంది అని చిలిపిగా బదులిచ్చింది.
ఇలియాన ప్రేమ వ్యక్తీకరణకు షాకు అయిన ఆండ్రూ "ఎప్పుడూ చెప్పలేదే, జీవితంలో ఇంతకన్నా పెద్ద లాటరీ నాకింకొటి లేదు.. ఐ లవ్ యూ" అంటూ బదులిచ్చాడు. వీరి ప్రేమ వ్యవహారం సోషల్ మీడియా సాక్షిగా జరిగింది. సో ఫైనల్లీ ఇలియానా ప్రేమలో పడ్డానంటూ ప్రపంచానికి చెప్పేసింది.