'ఊర్వశివో రాక్షసివో' సక్సెస్ మీట్ కి అల్లు అర్జున్
on Nov 5, 2022

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఊర్వశివో రాక్షసివో'. జీఏ2 పిక్చర్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ నవంబర్ 4న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ ని ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్ మీట్ ని నిర్వహిస్తున్నారు.
నవంబర్ 6న(ఆదివారం నాడు) 'ఊర్వశివో రాక్షసివో' సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నాడు. ఈ విషయాన్ని తాజాగా మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

తమిళ్ ఫిల్మ్ 'ప్యార్ ప్రేమ కాదల్'కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, పృథ్వి, పోసాని కృష్ణ మురళి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అచు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా తన్వీర్, ఎడిటర్ గా కార్తీక శ్రీనివాస్ వ్యవహరించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



