రాజాసాబ్ పై రచ్చ.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
on Aug 13, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్(The Raja Saab).హర్రర్ కామెడీగా తెరకెక్కుతున్న రాజాసాబ్ నుంచి ఇప్పటికే టీజర్ వచ్చి, అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో రాజాసాబ్ పై ఉన్న అంచనాల్ని రెట్టింపు చేసింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory)పై 'టిజి విశ్వప్రసాద్'(Tg Vishwa Prasad)నిర్మిస్తుండగా, మారుతీ(Maruthi)దర్శకుడు.
రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై 'ఢిల్లీ'(Delhi)కి చెందిన 'ఐవివై'(Ivy)సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. సదరు పిటిషన్ లో 'రాజాసాబ్ మూవీ నిర్మాణం కోసం 218 కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టాం. కానీ మూవీ అప్ డేట్స్ ని పీపుల్ మీడియా ఇవ్వడం లేదు. పదే పదే సినిమా వాయిదా వేస్తున్నారు. పద్దెనిమిది శాతం వడ్డీతో కలిపి మా డబ్బులు మాకు చెల్లించాలి. అప్పటి వరకు పీపుల్ మీడియాకి రాజా సాబ్ పై ఎలాంటి హక్కులు ఉండవని తమ పిటిషన్ లో పేర్కొంది. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది.
ఢిల్లీ కేంద్రంగా ఉన్న 'ఐవివై' సంస్థ గురించి పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. పీపుల్ మీడియా ప్రస్తుతం రాజాసాబ్ తో పాటు 'మిరాయ్' అనే మరో చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ రెండు చిత్రాలు అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటున్నాయి. షూటింగ్ చివరి దశలో ఉండగా, సెప్టెంబర్ 5 న మిరాయ్(Mirai)డిసెంబర్ 5 న రాజాసాబ్ విడుదల కానున్నాయి. 2018 లో సినీ రంగ ప్రవేశం చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆనతికాలంలోనే నెంబర్ ఆఫ్ సినిమాలని నిర్మించి ,అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందింది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో 'బ్రో' ని కూడా నిర్మించిన విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



