రజనీకాంత్ పై హృతిక్ రోషన్ కామెంట్స్.. ట్వీట్ లో ఏముంది
on Aug 13, 2025

సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth)రేపు వరల్డ్ వైడ్ గా 'కూలీ'(Coolie)తో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన కూలీ, రజనీ సినీ కెరీర్ యాభై సంవత్సరాలని పూర్తి చేసుకున్న సందర్భంగా రిలీజ్ కావడం, నాగార్జున(Nagarjuna)వంటి బిగ్ స్టార్ ఫస్ట్ టైం విలన్ గా, లియో తర్వాత కొంత గ్యాప్ తీసుకొని లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)తెరకెక్కించడంతో కూలీపై భారీ అంచనాలు ఉన్నాయి. హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్(Ntr)కలిసి చేసిన ప్రెస్టేజియస్ట్ మూవీ 'వార్ 2 'కూడా రేపు వరల్డ్ వైడ్ గా విడుదల కానుండటంతో అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది.
రీసెంట్ గా బాలీవుడ్ అగ్ర హీరో 'హృతిక్ రోషన్'(Hrithik Roshan)ఎక్స్(X)వేదికగా స్పందిస్తు 'రజినీకాంత్ సార్, మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. మీరు నా మొదటి గురువులలో ఒకరు. మీరు నాకు ఎప్పుడూ ఆదర్శం అవ్వాలి. 50 సంవత్సరాల ఆన్ స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు అభినందనలు అని పోస్ట్ చేసాడు. పాన్ ఇండియా లెవల్లో వార్ 2 , కూలీలో ఏ మూవీ ముందు వరుసలో నిలుస్తుందని అభిమానులు, సినీ ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్న వేళ, హృతిక్ చేసిన పోస్ట్ ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది.
1986 లో హిందీలో విడుదలైన 'భగవాన్ దాదా' అనే చిత్రంలో రజనీ కాంత్, హృతిక్ రోషన్ కలిసి నటించారు. ఈ చిత్రంలో 'భగవాన్ దాదా'(Bhagwan Dada)టైటిల్ రోల్ లో రజనీ చెయ్యగా, పన్నెండు సంవత్సరాల వయసు గల హృతిక్, రజనీ పెంపుకు కొడుకు గోవిందాదాదాగా కనిపించాడు. ఈ చిత్రంకి ముందు హృతిక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నాలుగు సినిమాలు చేసినా, అవి కేవలం అప్పీరియన్స్ చిత్రాలగానే మిగిలిపోయాయి. నటుడుగా 'భగవాన్ దాదా'నే మంచి గుర్తింపు ఇచ్చింది. ఈ చిత్రం తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకి పని చేసిన హృతిక్ 2000 వ సంవత్సరంలో 'కహోనా ప్యార్ హో'తో హీరోగా తెరంగ్రేటం చేసాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



