హిట్ 3 ఓటిటి డేట్ ఇదే!
on May 15, 2025
నాచురల్ స్టార్ నాని(Nani)వన్ మాన్ షో 'హిట్ 3'(Hit 3)మే 1 న వరల్డ్ వైడ్ గా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో'అర్జున్ సర్కార్' అనే పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో నాని తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 100 కోట్ల రూపాయిల మార్కుని కూడా దాటి నాని కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓవర్సీస్ లో కూడా సరికొత్త రికార్డులు సృష్టించి, నానికి యుఎస్ సిల్వర్ స్క్రీన్ వద్ద ఉన్న స్టామినాని మరోసారి చాటి చెప్పింది.
హిట్ 3 ఓటిటి హక్కులని నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. సదరు సంస్థ జూన్ 5 నుంచి హిట్ 3 ని స్ట్రీమింగ్ కి తీసురానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సంస్థ నుంచి త్వరలోనే అధికార ప్రకటన రానుందని తెలుస్తుంది. ప్రేక్షకుల ఊహలకి అందని విధంగా చివరి వరకు ఎంతో ఉత్కంఠని రేపే ఈ మూవీలో నానితో పాటు మిగతా పాత్రల్లో చేసిన వాళ్ళందరు తమ పాత్ర పరిధి మేరకు నటించి చిత్ర విజయానికి తోడ్పడ్డారు.
నాని సరసన శ్రీనిధిశెట్టి(Srinidhi Shetty)జతకట్టగా రావు రమేష్, సముద్ర ఖని, సూర్య శ్రీనివాస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ హీరోలు అడివి శేష్, కార్తీ కూడా కాసేపు మెరిసి ప్రేక్షకులని అలరించగా, శైలేష్ కొలను(Sailesh Kolanu)దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కగా నాని, ప్రశాంతి తిప్పరనేని సంయుక్తంగా నిర్మించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
