హీరోయిన్ స్నేహకి కొడుకు పుట్టాడు
on Aug 11, 2015
.jpg)
'హీరోయిన్ స్నేహకి కొడుకు పుట్టాడు. టాలీవుడ్ హోమ్ లీ హీరోయిన్ స్నేహ నిన్న రాత్రి మగబిడ్డకి జన్మ నిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త హీరో ప్రసన్నా ఈరోజు ఉదయం తెలియజేశాడు. ప్రసన్నా తో ఓ చిత్రంలో నటించిన సమయంలో ఇద్దరి మద్య సాన్నిహిత్యం ఏర్పడటంతో పెళ్ళికి దారి తీసింది. 2012లో వీరి పెళ్లి పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. తల్లి , బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కొడుకు పుట్టిన క్షణాలను ఆస్వాదిస్తున్నామని ప్రసన్నా సంతోషం వ్యక్తం చేశారు. సన్ ఆఫ్ సత్యమూర్తి లో ఉపేంద్ర సరసన స్నేహ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మథర్ గా కొత్త రోల్ ను మొదలెడుతున్న స్నేహకు కంగ్రాట్యులేషన్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



