విడాకుల బాధ ఓవర్... బికినీలో నవ్వుల్
on Jan 13, 2020

ప్రేమించి పెళ్లాడిన రోహిత్ మిట్టల్ తో విడిపోతున్నట్టు గతేడాది డిసెంబరులో 'కొత్త బంగారు లోకం' ఫేమ్ శ్వేతాబసు ప్రసాద్ అనౌన్స్ చేసింది. అప్పటికి కొన్ని నెలల క్రితమే విడిపోవాలని డెసిషన్ తీసుకున్నారు. అయితే తొలి వివాహ వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు విడాకుల ప్రకటన వచ్చింది. తర్వాత ఎప్పటిలా యాక్టింగ్, మ్యూజిక్ డాక్యుమెంటరీ పనుల్లో శ్వేతాబసు పడ్డారు. అయితే ఆమెలో మునుపటి నవ్వులు మాయమయ్యాయి. సోషల్ మీడియాలో ఆమె పోస్టులు చూస్తే అర్థమవుతుంది. కొన్ని ఫొటోల్లో నవ్వులు ఉన్నప్పటికీ... వాటి వెనుక ఏదో బాధ ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడు ఆ బాధ పోయినట్టు ఉంది. జనవరి 11న శ్వేతాబసు ప్రసాద్ పుట్టినరోజు. బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం ఆమె గోవా వెళ్ళింది. అక్కడ బీచ్ లో బికినీలో నవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగి పోస్టులు పెట్టింది. హ్యాపీ హ్యాపీగా తిరుగుతోంది. విడాకుల నుండి త్వరగా కోలుకుందని కొందరు చెబుతున్నారు. ఇలాగే ఉండమని మరికొందరు శ్వేతబసుకు సలహాలు ఇస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



