బాలయ్యకి భార్య పాత్రలో పూర్ణ?
on May 14, 2021

నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను.. బాక్సాఫీస్ కి ఫేవరేట్ కాంబినేషన్ ఇది. `సింహా` (2010), `లెజెండ్` (2014) వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత వీరిద్దరి కలయికలో `అఖండ` పేరుతో ముచ్చటగా మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. అందులో ఒకటి.. ఇప్పటివరకు బాలయ్య ఎప్పుడూ చేయని అఘోరా పాత్ర కావడం విశేషం. టైటిల్ రోర్ లో తన లుక్, డైలాగ్స్ తో మెస్మరైజ్ చేశారు నటసింహ.
ఇదిలా ఉంటే.. `అఖండ`లో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరికి కూడా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలేనని సమాచారం. కాగా, పూర్ణ పాత్రకి సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్స్ లో పూర్ణ కనిపిస్తుందట. అంతేకాదు.. బాలయ్యకి భార్య పాత్రలో ఆమె దర్శనమివ్వనుందట. పాత్ర నిడివి తక్కువే అయినా.. కథలో చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. మరి.. `అఖండ`తో పూర్ణకి నటిగా ఎలాంటి గుర్తింపు దక్కుతుందో చూడాలి.
ద్వారక క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న `అఖండ`కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



