విశాల్ కు తీవ్ర గాయాలు
on May 1, 2014

విశాల్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న తమిళ చిత్రం "పూజై". హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ లో హీరో విశాల్ కు ఇటీవలే తీవ్ర గాయాలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బ్రిడ్జ్ పై నుంచి కారుతో జంప్ చేసే సన్నివేశాలను తెరకెక్కించే సమయంలో విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే యూనిట్ సభ్యులు విశాల్ ను హాస్పిటల్ కి తరలించారు. ఆయన ఎడమ చేతికి దాదాపు 20కుట్లు పడినట్లు తెలిసింది. దాంతో రెండు వారాలపాటు షూటింగ్ ఆపేసారు. అసలే మాస్, యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరి ఈ సినిమాను ఎలాగైనా ఓ బ్లాక్ బస్టర్ గా తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. విశాల్ స్వయంగా తన స్వంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



