ఆ హీరోయిన్ల జాబితాలో రాజశేఖర్ చిన్న కుమార్తె కూడా...
on Nov 25, 2020

కొందరు కథానాయికలు కేవలం నటనకు మాత్రమే పరిమితం కారు... వాళ్ళల్లో చాలా కళలు ఉంటాయి. అప్పుడప్పుడు వాటిని బయట పెడుతూ ఉంటారు. ఉదాహరణకు... హన్సిక చక్కని పెయింటింగులు గీస్తుంటారు. ఇస్మార్ట్ నభా నటేష్ కూడా పెయింటింగులు వేస్తుంటారు. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా స్కెచ్ గీస్తారు. ఇలా మల్టీ టాలెంట్ ఉన్న హీరోయిన్ల జాబితాలో రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక కూడా చేరారని చెప్పుకోవాలి.
'దొరసాని' ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైన శివాత్మిక రాజశేఖర్ చక్కని పెయింటింగ్ వేశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. శివాత్మిక కళకు ప్రశంసలు దక్కుతున్నాయి.
కొన్ని రోజుల క్రితం రాజశేఖర్ ఫ్యామిలీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అందరూ ఆరోగ్యంగా మహమ్మారి నుండి బయటపడ్డారు. అందరి కంటే రాజశేఖర్ ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. దీపావళికి ముందే ఆయన కూడా ఇంటికి చేరుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



