ఆ విషయంలో నాని అట్టర్ ఫ్లాపయ్యాడు
on Mar 17, 2015
.jpg)
ఏ హీరోకైనా ప్రతిభతో పాటు ప్లానింగ్ చాలా అవసరం. కెరీర్‌ని సవ్యవంగా నడిపించుకోవడంలో ప్లానింగ్‌దే కీలక పాత్ర. ఏ సమయంలో సినిమాని విడుదల చేసుకోవాలి?? సినిమా సినిమాకీ మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? అనే విషయాల్లో శ్రద్ధ వహిస్తేనే కెరీర్ సవ్యంగా ఉంటుంది. అయితే ఈ విషయంలో నాని ఓ ఫ్లాప్ హీరోనే. తన కెరీర్ ప్లానింగ్‌లో ఇది వరకు ఎన్నో తప్పులు చేశాడు. ఇప్పుడూ చేస్తూనే ఉన్నాడు. నాని సినిమాలు వస్తే గుంపు గుంపుగా వస్తాయి. లేదంటే ఒక్క సినిమా కూడా ఉండదు. ఆమధ్య ఆహా కల్యాణం, పైసా ఒక దాని తరవాత ఒకటి విడుదలయ్యాయి. ఒక సినిమా ప్రభావం మరో సినిమాపై పడి రెండూ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడూ అంతే. ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపైకపిరాజు ఒకే రోజు విడుదల అవుతున్నాయి. ఒకే రోజు రెండు సినిమాలంటే.. ఏ హీరోకైనా దెబ్బే. ఎందుకంటే ప్రేక్షకుల్ని పంచుకోవడం తప్ప.. కొత్త ప్రేక్షకుల్ని ఏ హీరో సృష్టించలేడు. ఒక సినిమా పోతే. ఆ ప్రభావం కచ్చితంగా రెండో సినిమాపై పడుతుంది. ఒకవేళ రెండూ ఫ్లాప్ అయితే.. నాని కెరీర్‌కి అదో మాయని మచ్చగా మిగిలిపోతుంది.
జెండాపైకపిరాజు ఆల్రెడీ తమిళంలో ఫ్లాప్ అయ్యింది. తెలుగులో అద్భుతాలు సృష్టిస్తుందన్న గ్యారెంటీ లేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నాని... 'జెండాపైకపిరాజు' సినిమాని వాయిదా వేయాలని శతవిధిలా ప్రయత్నిస్తున్నాడు. అయితే జెండాపైకపిరాజు నిర్మాతలు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. ఇప్పటికే మా సినిమా చాలాసార్లు వాయిదా పడింది. ఇప్పుడు రాకపోతే.. మరో మంచి డేటు దొరకడం కష్టం. అందుకే.. 'ఎవడే సుబ్రహ్మణ్యం'వాయిదా వేసుకోండి అంటూ రివర్స్ లో సమాధానం ఇస్తున్నారు. చూస్తూ ఉండిపోవడం తప్ప.. ఈ విషయంలో నాని చేయగలిగిందేం లేదు. ఈ రెండు సినిమాలూ బాగా ఆడితే సరే సరి. లేదంటే.. నాని ఇరకాటంలో పడిపోవడం ఖాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



