Home

»

Latest News

వెంకీ, మ‌హేశ్, ప్ర‌భాస్, చ‌ర‌ణ్ త‌రువాత నితిన్ తో!

Feb 23, 2022


త‌మిళ‌నాట స్టార్ కంపోజ‌ర్ గా రాణించాడు హ్యారిస్ జైరాజ్. మ‌రీముఖ్యంగా.. త‌న తొలి చిత్రం `మిన్న‌లే` (తెలుగులో `చెలి`) అయితే మ్యూజిక‌ల్ గా ఓ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఆపై ప‌లు సంచ‌ల‌న విజ‌యాల‌తో ద‌శాబ్దానికి పైగా కోలీవుడ్ లో హ‌వా చాటాడు హారిస్. వాటిలో కొన్ని సినిమాలు తెలుగులోనూ అనువాద రూపంలో అల‌రించాయి.

Also Read: 'భీమ్లా నాయ‌క్' ట్రైల‌ర్ చెప్తోన్న బీభ‌త్స‌మైన విష‌యాలివే!

ఇక టాలీవుడ్ లోనూ నేరుగా కొన్ని సినిమాల‌కు హ్యారిస్ జైరాజ్ స్వ‌రాలు స‌మ‌కూర్చాడు. విక్ట‌రీ వెంక‌టేశ్ కాంబినేష‌న్ లో `వాసు`, `ఘర్ష‌ణ‌` చేసిన హారిస్.. ఆపై సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో `సైనికుడు`, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో `మున్నా`, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో `ఆరెంజ్` చేశాడు. ఇవ‌న్నీ కూడా మ్యూజిక‌ల్ గా మెప్పించాయి. చివ‌రిగా మ‌హేశ్ హీరోగా న‌టించిన బైలింగ్వ‌ల్ మూవీ `స్పైడ‌ర్`తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను నేరుగా ప‌ల‌క‌రించాడు హ్యారిస్.

Also Read: 'రాధేశ్యామ్'లో మెగా సర్ ప్రైజ్!

క‌ట్ చేస్తే.. దాదాపు ఐదేళ్ళ త‌రువాత మ‌రో తెలుగు సినిమాకి బాణీలు అందిస్తున్నాడు హ్యారిస్ జైరాజ్. ఈ సారి యువ క‌థానాయ‌కుడు నితిన్ కాంబినేష‌న్ లో ఈ సినిమా చేయ‌బోతున్నాడు. వ‌క్కంతం వంశీ డైరెక్ట్ చేయ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ బాట ప‌ట్ట‌నుంది. టాలీవుడ్ లో చేసిన ప్ర‌తీ ప్ర‌య‌త్నంతోనూ ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌ను మ్యూజిక‌ల్ గా మెప్పించిన హ్యారిస్ జైరాజ్.. నితిన్ సినిమాతో ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ కూడా అందుకుంటాడేమో చూడాలి.  

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com