Home

»

Latest News

'రాధేశ్యామ్'లో మెగా సర్ ప్రైజ్!

Feb 22, 2022 11:29AM

ప్రభాస్‌, దీపికా పదుకొనే జంటగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్‌ కే' మూవీలో బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌, అమితాబ్‌ లను ఒకే స్క్రీన్ మీద చూడటం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే 'ప్రాజెక్ట్‌ కే' కంటే ముందే 'రాధేశ్యామ్'తో సర్ ప్రైజ్ చేయనున్నారు అమితాబ్.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాధేశ్యామ్'. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈ మూవీ మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో బిగ్ సర్ ప్రైజ్ ఉంది. ఈ మూవీకి అమితాబ్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన మూవీ టీమ్, అమితాబ్ కి స్పెషల్ థాంక్స్ చెప్పింది. "మీ నెరేష‌న్‌ తో ఎపిక్ ల‌వ్ స్టోరిని మ‌రింత ఎపిక్‌ గా మార్చినందుకు ధ‌న్య‌వాదాలు" అని మూవీ టీమ్ తెలిపింది.

తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి.. హిందీలో అమితాబ్ వాయిస్ ఓవర్ అందించినట్లు తెలుస్తోంది. మరి మిగతా భాషల కోసం ఏయే స్టార్స్ ని రంగంలోకి దింపుతారో చూడాలి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించే అవకాశముందని అంటున్నారు.

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com