హరి హర వీరమల్లు.. కొత్త రిలీజ్ డేట్ లాక్..!
on Jun 13, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. ఈ జూన్ 12న విడుదల కావాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యమవ్వడంతో మళ్ళీ వాయిదా పడింది. దీంతో 'వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు కొత్త తేదీ లాక్ అయినట్లు తెలుస్తోంది. (Hari Hara Veera Mallu)
'హరి హర వీరమల్లు' సినిమాని జులై 18న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. జులై మూడో వారంలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కావడంలేదు. దీంతో వీరమల్లుకి సోలో రిలీజ్ దొరికినట్టే. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి చిత్రమిది. అలాగే పవన్ నటించిన మొదటి పీరియాడిక్ ఫిల్మ్. అదీ గాక ఆయన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఆలస్యమైనప్పటికీ.. ఇన్ని విశేషాలతో వస్తున్న ఈ చిత్రాన్ని పవన్ ఫ్యాన్స్ ఏ స్థాయికి తీసుకెళ్తారో చూడాలి.
మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తున్న 'హరి హర వీరమల్లు' మూవీ క్రిష్ డైరెక్షన్ లో ప్రారంభమైంది. ఆ తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ ప్రతి నాయకుడు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



