హరిహరవీరమల్లుని నిలబెడుతున్న ఏడు ఎపిసోడ్స్ ఇవే
on Nov 16, 2024
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)అప్ కమింగ్ మూవీస్ లో హరిహరవీరమల్లు(hari hara veera mallu)కూడా ఒకటి.చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మీద అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.పవన్ డిప్యూటీ సిఎం అయ్యాక విడుదల కాబోతున్న ఫస్ట్ మూవీ వీరమల్లునే కావడంతో, మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే వీరమల్లు లో ఏడు ఎపిసోడ్లు చాలా కీలకంగా ఉండబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి.కోహినూర్ వజ్రాన్ని పవన్ కళ్యాణ్ దొంగతనం చేసే సన్నివేశం,కుస్తీ ఫైట్,అడవిలో తోడేలుని వేటాడే సీన్, సముద్రం నుంచి వచ్చి పోర్ట్ లో చేసే యుద్ధం, గుర్రాలతో ప్లాన్ చేసిన సీక్వెన్సు,ఛార్మినార్ సెట్ ముందు చిత్రీకరించిన సన్నివేశాలతో పాటు ఐటెం సాంగ్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది. వీటికి సంబంధించిన గ్రాఫిక్ విజువల్స్ కి, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ తోడవ్వడంతో రేపు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమనే టాక్ కూడా వినపడుతుంది.
.webp)
శ్రీ సూర్య మూవీ పతాకంపై అగ్ర నిర్మాత ఏఎం రత్నం(a m rathnam)ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా, పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.నిది అగర్వాల్,నోరా ఫతేహి, విష్ణుసేన్ గుప్తా,రఘు బాబు, సుబ్బరాజు ముఖ్య పాత్రల్లో కనిపిస్తుండగా బాబీ డియోల్ ఔరంగజేబుగా చేస్తున్నాడు.ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ(jyothi krishna)దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మార్చి 28న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



