తగ్గిన 'హరి హర వీరమల్లు' టికెట్ ధరలు..!
on Jul 27, 2025

టికెట్ ధరల పెంపు అనేది కొన్ని సినిమాలకు వరంలా మారితే, మరికొన్ని సినిమాలకు శాపం అవుతుంది. తాజాగా విడుదలైన 'హరి హర వీరమల్లు' విషయంలోనూ అదే జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ని రాబట్టిన వీరమల్లు.. రెండో రోజు నుంచి ఆ స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయింది. దానికి ప్రధాన కారణం.. అధిక టికెట్ ధరల కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మేకర్స్.. టికెట్ ధరల విషయంలో మనసు మార్చుకున్నారు.
'హరి హర వీరమల్లు' సినిమాకి మొదటి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అయితే ఏపీతో పోలిస్తే ఇప్పటికే తెలంగాణలో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఇంకా పెంచడంతో.. అధిక ధరల కారణంగా ఫుట్ ఫాల్స్ పై ప్రభావం పడింది. దీంతో మేకర్స్ టికెట్ రేట్స్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి టికెట్ ధరలు సాధారణంగా ఉండనున్నాయి. ఇప్పటికే ఆన్ లైన్ లో రెగ్యులర్ టికెట్ రేట్స్ తో బుకింగ్స్ చూపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'హరి హర వీరమల్లు' జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టింది. నేటితో ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ చేరనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రేపటి నుంచి టికెట్ ధరలు సాధారణంగా ఉండటంతో.. ఫుట్ ఫాల్స్ పెరిగే అవకాశముంది అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



