ఢిల్లీ ఏపీ భవన్ లో 'హరి హర వీరమల్లు' చిత్ర ప్రదర్శన
on Jul 26, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం 'హరి హర వీరమల్లు'. జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాని ఢిల్లీలోని ఏపీ భవన్ లో రెండు రోజుల పాటు ప్రదర్శించబోతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం బిజీ జీవితం గడుపుతున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతోపాటు వివిధ రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలుగు వారి కోసం డిప్యూటీ సీఎం పవన్ నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని రెండు రోజుల పాటు ఏపీ భవన్ లో ప్రదర్శిస్తున్నారు. వారాంతపు సెలవు దినాలు అయిన శని, ఆదివారాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో రెండు షోలు వేస్తున్నట్టు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ ప్రకటన విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న తెలుగు వారి కోసం, ఢిల్లీలో స్థిరపడిన తెలుగు వారి కోసం చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. శనివారం రాత్రి 7 గంటలకు మొదటి షో వేయగా ఆడిటోరియం ప్రేక్షకులతో నిండిపోయింది. 27వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరో షో వేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



