'హరి హర వీరమల్లు'కి రెండో రోజు ఊహించని కలెక్షన్స్!
on Jul 26, 2025

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. జానర్, కంటెంట్ తో సంబంధం లేకుండా.. ఆయన సినిమాలకు సంచలన ఓపెనింగ్స్ వస్తుంటాయి. ఆ విషయం 'హరి హర వీరమల్లు' చిత్రంతో మరోసారి రుజువైంది. ఫస్ట్ డే ఈ మూవీ పవన్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. అయితే సెకండ్ డే కలెక్షన్స్ మాత్రం ఊహించని విధంగా ఉన్నాయి.
'హరి హర వీరమల్లు' విడుదల తేదీ జూలై 24 కాగా, జూలై 23 రాత్రి నుంచే షోలు మొదలయ్యాయి. దీంతో అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. ప్రీమియర్ షోలు మాత్రమే కాదు.. మొదటిరోజు కూడా థియేటర్లు కళకళలాడాయి. ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.39 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే రెండో రోజు మాత్రం ఎవరూ ఊహించనివిధంగా అందులో పది శాతం మాత్రమే రాబట్టిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. రెండు రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్ల లోపు షేర్ కే పరిమితమైందని అంటున్నారు.
'హరి హర వీరమల్లు' కలెక్షన్స్ లో ఈ రేంజ్ డ్రాప్ కనపడటానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. అందులో మొదటిది ఈ మూవీ డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. సెకండాఫ్ తేలిపోయిందని, వీఎఫ్ఎక్స్ బాలేదనే కామెంట్స్ వినిపించాయి. దానికి తోడు టికెట్ రేట్లు అధికంగా ఉండటంతో పాటు, నెలాఖరు కావడంతో.. ఫ్యామిలీ ఆడియన్స్ వెనుకాముందు ఆడుతున్నారు. ఇది చాలదు అన్నట్టు ప్రస్తుతం తెలుగునాట భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవన్నీ కలిసి 'వీరమల్లు' రెండో రోజు కలెక్షన్స్ పై ప్రభావం చూపాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. శని, ఆదివారాలు మెరుగైన వసూళ్లు వచ్చే అవకాశముందని కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



