హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్
on Sep 2, 2014
.jpg)
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా... హీరోగా టాలీవుడ్ కి పరిచయమై గోకులంతో సీత, సుస్వాగతం వంటి విభిన్న కథాచిత్రాల్లో నటించి మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుని.... 'తొలి ప్రేమ'తో లవ్ స్టోరీస్ లో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి 'తమ్ముడు'తో అన్నకు తగ్గ తమ్ముడుగా అద్భుత విజయాన్ని సాధించి 'బద్రి'తో తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ ని క్రియేట్ చేసుకుని 'ఖుషి'తో రికార్డులు బ్రేక్ చేసి అందరూ తన స్టైల్ ని ఫాలో అయ్యే రేంజికి ఎదిగి జానితో దర్శకుడుగా పరిచయమై గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం చిత్రాలతో ఓపెనింగ్స్ క్రియేట్ చేసి జల్సాతో బాక్సాఫీస్ ని మరోసారి షేక్ చేసి కొమరం పులి, తీన్ మార్, పంజా చిత్రాల తర్వాత గబ్బర్ సింగ్ తో మళ్ళీ తన పవర్ ఏమిటో చూపించి 'అత్తారింటికి దారేది' తో మరోసారి సరికొత్త రికార్డులు సృష్టించాడు. నిన్నటిదాకా ఒక కథానాయకుడిగా వున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ప్రజా నాయకుడిగా మారారు. ఇప్పుడు ఆయన బలం, బలగం రెట్టి౦పైంది. ఇప్పుడు తన అభిమానుల్ని కూడా సమాజ సేవలో భాగం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం 'గోపాల గోపాల' చిత్ర షూటింగ్ బిజీగా వున్నపవన్..ఆతరువాత జనసేన పార్టీ బలోపేతం పై దృష్టి సారించనున్నారు.
సెప్టెంబర్ 2తో 43వ వసంతంలోకి అడుగు పెడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి తెలుగు వన్ తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



