హన్సికా లవ్ షాదీ డ్రామా రెండో ఎపిసోడ్ వచ్చేసింది
on Feb 18, 2023

హీరోయిన్ హన్సిక తన పెళ్ళి సమయంలో జరిగిన సంఘటనలు అన్నీ కలిపి ఒక సిరీస్ లా తోసుకొచ్చారు. గతవారమే మొదటి ఎపిసోడ్ రిలీజ్ చేయగా దానికి మంచి స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా రెండవ ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హన్సిక పెళ్ళి గురించి తను అనుభవించిన కష్టాల గురించి ఈ ఎపిసోడ్ లో చెప్పుకొచ్చింది.
ఈ రెండవ ఎపిసోడ్ లో ... చెన్నై లో హన్సిక ఒక సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు ఒక వార్త బయటకొచ్చింది. అది చూసి హన్సిక చాలా డిప్రెషన్ లోకి వెళ్ళింది. హన్సిక పెళ్ళి గురించి పత్రికలలో వచ్చింది చూసి తను మానసికంగా బాలేదని తెలుసుకొని వాళ్ళ అమ్మ తనకి దైర్యం ఇవ్వడానికి చెన్నెకి వచ్చింది. అక్కడ హన్సికతో నువ్వు ధైర్యంగా ఉండాలని వాళ్ళ అమ్మ సపోర్ట్ గా మాట్లాడింది.
మొదటిసారి నా హార్ట్ బ్రేక్ అయినప్పుడు నేను చాలా చిన్నదాన్ని.. అప్పుడు నా వయసు ఇరవై ఒకటి మాత్రమే.. అప్పుడే నేను ఎదుర్కొన్నాను ఇప్పుడు కూడా ధైర్యంగా ఉంటానని తనకి తాను సపోర్ట్ చేసుకుంది హన్సిక. తన పెళ్ళికి తొమ్మిది రోజుల ముందు ఇలా రావడం తనకి చాలా భాదని కలిగించిందని చెప్పింది. వాళ్ళ అమ్మ ట్రెడిషనల్ స్టైల్ లో పెళ్ళి జరగాలని ఒకవైపు, హన్సిన మోడ్రన్ స్టైల్ లో జరగాలని చెప్పడంతో వాళ్ళ మేనేజర్ కి పెద్ద సమస్య వచ్చింది. దాంతో అతను ఇద్దరికి కాసేపు పరిస్థితులను వివరించి.. మోడ్రన్ స్టైల్ కి హన్సిక వాళ్ళ అమ్మని కన్విన్స్ చేసాడు.
ఈ రెండవ ఎపిసోడ్‌లో సోహెల్, హన్సిక మరియు వాళ్ళ అమ్మనాన్న కలిసి గోల్ఫ్ చూడటానికి వెళ్తారు. అక్కడ ఆ గేమ్ చూసి హన్సికకి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే తన పెళ్ళి గోల్ఫ్ గ్రౌండ్ లో చేసుకుందామని చెప్పినప్పుడు అందరూ వద్దన్నారు. ఆ తర్వాత తను చెప్పినట్టే చేయాల్సి వచ్చిందని హన్సిక చెప్పుకొచ్చింది. ఈ ఎపిసోడ్ ని ఆసక్తికరంగా ముగించారు. మరో ఎపిసోడ్ ప్రోమో కూడా ఆకట్టుకుంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



