హంసా హొయలు అదుర్స్!
on Jun 6, 2015
మిర్చి.. మిర్చి.. మిర్చి లాంటి కుర్రాడే.. అంటూ ప్రభాస్ 'మిర్చి' కోసం హాట్ హాట్ గా కనిపించి కుర్రకారు గుండెల్లో హీట్ పుట్టించిన బ్యూటీ హంసా నందిని. హీరోయిన్గా రాని సక్సెస్ మిర్చి ఐటమ్ సాంగ్తో అమ్మడి సొంతమైంది. ఆ ఊపులోనే అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, భాయ్, లెజెండ్ తదితర చిత్రాల కోసం ప్రత్యేక గీతాల్లో కనువిందు చేసిందీ అందం. ఇదిలా ఉంటే.. గుణశేఖర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం రుద్రమదేవిలోనూ హంసా ఓ ప్రత్యేక గీతం చేసింది. అంతేకాకుండా కాస్త నిడివి ఉన్న మదానిక అనే పాత్రను పోషించింది. జూన్ 26న విడుదల కానున్న ఈ సినిమాలో హంసా హొయలు అదుర్స్ అనిపించేలా ఉంటాయని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయ్.