హంస చిందేస్తే సినిమా సూపర్‌హిట్టే
on Jul 8, 2014
హంసానందిని.. పేరుకు తగ్గట్టు అందమైన రూపం, అదిరిపోయే డ్యాన్సు. దానికి తోడు ఆమె ఒక్క సాంగ్ లో కనిపించిన చిత్రాలన్నీ హిట్టు. ప్రభాస్ ‘మిర్చి' చిత్రంలో టైటిల్ సాంగ్ లో హాట్ మిర్చీగా కనిపించిన హంసానందిని ఆ తర్వాత అత్తారింటికి దారేది, లెజెండ్, సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ లో కనిపించింది. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి.
తెలుగు సినిమాల్లో సెంటిమెంటుకు ఎంత ప్రాధాన్యత వుంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఇదే సెంటిమెంటు అంతటా చర్చగా మారింది. ఈ లక్కీ గర్ల్ ఐటం సాంగ్ లలో కనిపిస్తే ప్రేక్షకలు అదరహో అంటూ వుండటము, వరుసగా చిత్రాలన్నీ విజయాలు సాధించడంతో ఈ భామకు గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రంలో కూడా అవకాశం ఇచ్చారట. ముమాయత్ ఖాన్ సినిమాల్లో ఎక్కువగా కనిపించటం మానేసిన తర్వాత తెలుగు సినిమాల్లో ఐటం గర్ల్ స్థానాన్ని హంసానందిని భర్తి చెయ్యగలదని అనుకోవచ్చు. రియల్ స్టార్ శ్రీహరి ఆఖరి చిత్రం ‘రియల్ స్టార్’ లోనూ హంసా తన స్టెప్పులతో అదరగొట్టిందట.