రెండో హిట్... డైలాగులు బ్యాలన్స్
on May 27, 2020
విశ్వక్ సేన్ హీరోగా నేచురల్ స్టార్ నాని నిర్మించిన సినిమా 'హిట్'. హీరోకి హిట్టు, నిర్మాతకు ప్రాఫిట్టు తెచ్చింది. ఈ సినిమాతో శైలేష్ కొలను దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 'హిట్' ఎండింగ్ లో సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చాడు. లాక్ డౌన్ సమయంలో అతడు సీక్వెల్ స్టోరీ కంప్లీట్ చేశాడు. డైలాగ్ వెర్షన్ ఒక్కటే బ్యాలన్స్ ఉందని చెప్పాడు. కొన్ని వారాల్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తానని శైలేష్ చెబుతున్నాడు. ప్రస్తుతం 'పాగల్' అని విశ్వక్ సేన్ ఒక సినిమా చేస్తున్నాడు. అది కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఈలోపు మిగతా పనులు కంప్లీట్ చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు.
'హిట్' సినిమాను హిందీలో దిల్ రాజు రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఒకవేళ హిందీలో 'హిట్'కి డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే చేస్తారా? అని అడిగితే "తప్పకుండా. ఎక్కువమంది ప్రేక్షకులకు నా వర్క్ చూపించే అవకాశం వస్తే ఎందుకు వద్దనుకుంటాను? డబ్బుల కంటే ఫిలింమేకర్స్ ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ కావడం ముఖ్యమని భావిస్తారు" అని శైలేష్ కొలను చెప్పారు.