ఆ దర్శకుడ్ని టార్చర్ పెడుతున్న అనుష్క
on Aug 20, 2015
.jpg)
రుద్రమదేవి సినిమా కోసం తన సర్వస్వం ధారబోశాడు గుణశేఖర్. ఈసినిమాని విడుదల చేయడానికి ఆపసోపాలు పడుతున్నాడు. అయితే.. తన టీమ్ నుంచే గుణకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచీ... ఈ సినిమా ప్రమోషన్‌పై దృష్టి నిలిపాడు గుణ. అనుష్కని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నాడు. అయితే ఈ ఇంటర్వ్యూల విషయంలో అనుష్క పెద్దగా కోపరేట్ చేయడం లేదని వినికిడి. తన దృష్టంతా... సైజ్ జీరోపై ఉందని, ఈ ప్రమోషన్లపై అస్సలు దృష్టి నిలపడం లేదని టాక్.
ఏదో గుణశేఖర్ బలవంతం చేస్తున్నాడని... తప్పక ఇంటర్వ్యూలు ఇస్తోందని, రుద్రమదేవి గురించి కాన్ఫిడెన్స్‌గా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని. టీవీ ఛానళ్ల లైవ్ పోగ్రాంకి రమ్మంటే ససేమీరా అంటోందట. అంతేకాదు.. ప్రమోషన్‌కి ఆరు రోజులు మాత్రమే కేటాయిస్తానంటోందట. ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఆరు రోజులు ఏం సరిపోతుందని బెంగ పెట్టుకొంటున్నాడు గుణశేఖర్.
దానికి తోడు... రుద్రమదేవికి ధీటుగా మరో వైపు సైజ్ జీరో ప్రమోషన్లు మొదలయ్యాయి. ఓ సినిమా ఉండగా, మరో సినిమా ప్రమోషన్లపై అనుష్క దృష్టి పెట్టడం.. గుణశేఖర్‌కి నచ్చడం లేదు. అయితే అనుష్క వెర్షన్ మాత్రం వేరుగా ఉంది. ఇప్పటి వరకూ రుద్రమదేవి కోసం లెక్కలేనన్ని కాల్షీట్లు కేటాయించానని, కొన్ని సినిమాలు కూడా వదులుకొన్నానని, ఇంతకుమించి ఏం చేయలేనని అనుష్క చెబుతోందట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



