ఏడాది తర్వాత ఓటిటిలోకి వచ్చిన మూవీ.. ఆడపిల్లకి అన్యాయం చేస్తే అంతే మరి
on Apr 24, 2025

దేశముదురు, కంత్రీ, మస్కా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, పవర్, లక్కున్నోడు, గౌతమ్ నంద, తెనాలి రామకృష్ణ వంటి పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులని మెప్పించిన ముంబై భామ హన్సిక(Hansika).పలు తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించిన హన్సిక 2024 లో తమిళంలో గార్డియన్(Guardian)అనే మూవీ చేసింది.
ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తెలుగు వెర్షన్ ఓటిటి వేదికగా 'ఆహా' లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది. ముందస్తు ప్రకటన లేకుండానే మేకర్స్ ఓటిటి లో రిలీజ్ చేసారు. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన గార్డియన్ లో హన్సిక నటన ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది. సమాజంలోని కొంత మంది వ్యక్తుల వల్ల చనిపోయిన ఒక యువతి సదరు వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆత్మగా మారుతుంది. ఈ క్రమంలో ఆ యువతికి ఇద్దరు వ్యక్తులు సాయం చేస్తారు. ఆ యువతికి జరిగిన అన్యాయం ఏంటి? అన్యాయం చేసింది ఎవరు? సాయం చేసిన ఆ ఇద్దరు ఎవరు? యువతి ప్రతీకారం తీర్చుకుందా? లేదా అనే కథాంశాలతో గార్డియన్ తెరకెక్కింది.
హన్సిక తో పాటు సురేష్ చంద్రమీనన్, శ్రీమాన్, రాజేంద్రన్, అభిషేక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫిలిం వర్క్స్ పతాకంపై విజయచందర్(VIjay Chandar)నిర్మించగా గురు శరవణన్ శబరి(Guru Saravanan Sabari)దర్శకత్వం వహించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



