మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ
on Sep 9, 2014
.jpg)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా రిలీజ్ గురించి ఎలాంటి న్యూస్ బయటకి రాకపోవడంతో 'అక్టోబర్ 1' విడుదలపై అనేక సందేహాలు మొదలయ్యాయి. కానీ ఆరు నూరైనా అనుకున్న టైమ్ కే గోవిందుడు వస్తాడని ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు నిర్మాత బండ్ల గణేష్. అలాగే యువన్ శంకర్ రాజా అందించిన సంగీతాన్ని ఈ నెల 15న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం డిఐ కూడా పూర్తయిందట. రెండో భాగానికి సంబందించిన పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి ఎమోషనల్ క్లయిమాక్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ చిత్రంతో కృష్ణవంశీ మళ్లీ తమ స్టామినా చూపిస్తాడట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



