కన్ ఫ్యూజ్ చేస్తోన్న డైరక్టర్స్!!
on Nov 12, 2018
రౌండప్ చేసి కన్ ఫ్యూజ్ చేస్తూ కన్ ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా అనేది పోకిరి లో మహేష్ బాబు డైలాగ్ . ఇప్పుడు హీరో గోపిచందర్ పరిస్తితి అలాగే ఉందట. ఎందుకను కుంటున్నారా? వరుస సినిమాలతో ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరో ప్రస్తుతం కొత్త దర్శకుడితో ఓ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే తన తదుపరి సినిమాలుగా ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్ ఓకే చేశాడట. అందులో గతంలో తనతో సినిమాలు చేసి ఇద్దరు దర్శకులు ఉన్నారు. మరొకరు తమిళ దర్శకుడు. ముగ్గరు దర్శకులు ఫ్లాపుల్లో ఉండటం విశేషం. ఒక సారి ఆ వివరాల్లోకి వెళితే... గోపిచంద్ తో లక్ష్యం, లౌక్యం లాంటి సినిమాలు చేసిన శ్రీవాస్ ఇప్పటికే ఒక స్టోరి వినిపించాడట. స్టోరీ లైన్ బాగా నచ్చడంతో వెంటన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట గోపిచంద్. అలాగే సంపత్ నందితో గౌతమ నంద చిత్రాన్ని చేసాడు గోపిచంద్. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయినా ఈ దర్శకుడికి మరో సారి అవకాశం ఇచ్చాడు గోపిచంద్. అలాగే ఈ రెండు సినిమాలతో పాటు తమిళ చిత్ర దర్శకుడు తిరు చెప్పిన స్టోరి కి ఫ్లాటయ్యాడట గోపించంద్. ఈయన గతంలో విశాల్ తో రెండు సినిమాలు చేశాడు. అవి తెలుగులో `వెంటాడు వేటాడు` , ఇంద్రుడు` పేరుతో అనువాదమయ్యాయి. రెండు తెలుగులో పెద్దగా ఆడలేదు. తమిళంలో మాత్రం సక్సెస్ అయ్యాయి. ఆ నమ్మకంతోనే గోపిచందర్ తిరుకి ఓకే చెప్పాడు. ఇలా మూడు ప్రాజెక్ట్స్ చేసిన గోపించంద్ ఏ సినిమా ముందు స్టార్ట్ చేయాలో తెలియన కన్ ఫ్యూజ్ లో ఉన్నాడట. త్వరలో ఏది ముందో తెలిసే అవకాశాలున్నాయి.