మార్చి 27న గోపిచంద్ జిల్ రిలీజ్
on Mar 18, 2015
.jpg)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిర్చి వంటి బ్లాక్ బస్టర్ తో తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అందుకున్న నిర్మాతలు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం జిల్. లౌక్యం చిత్రంతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నగోపిచంద్ హీరోగా నటించగా రాశిఖన్నా హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జిల్ చిత్రాన్ని మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ ముఖ్య అతిధిగా హాజరై విడుదల చేసిన ఆడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వచ్చింది. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. హీరోయిన్ రాశిఖన్నా అందచందాలు, అభినయం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి.
మార్చి 27న జిల్ విడుదలౌతున్నసందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... గోపిచంద్ హీరోగా యూవి క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించిన జిల్ చిత్రాన్ని మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాం. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారిస్థాయిలో ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ జిల్ చిత్రాన్ని రూపొందించాడు. గోపిచంద్ స్టైలిష్ పవర్ ఫుల్ పెర్ ఫర్మెన్స్ ఈ సినిమాకు హైలైట్. గోపిచంద్ ఈ తరహా పాత్రలో ఇప్పటివరకు కనిపంచలేదు. గోపిచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకునే స్టామినా ఉన్న సినిమా ఇది. గోపిచంద్, రాశిఖన్నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. గిబ్రాన్ అందించిన పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. రీ రికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. అని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



