కృష్ణాష్టమికి గోపాల గోపాల మొదటి దర్శనం
on Jul 25, 2014

టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ "గోపాల గోపాల" చిత్రం గురించి పరిశ్రమల్లో, అభిమానుల్లో నెలకొన్న ఆసక్తి గురించి విడిగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ మోడరన్ కృష్ణుడిగా ఎలా వుంటాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపులు ఆగస్టు 17 న ముగియనున్నాయి. గోపాల గోపాల టైటిల్‌కి అనుగుణంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ను కృష్ణాష్టమి రోజున విడుదల చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నారు.
అలాగే అక్టోబర్ 23న దీపావళి పండుగ రోజున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దపడుతున్నట్లు తెలిస్తోంది. బాలీవుట్ చిత్రం ఓ మై గాడ్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్, పవన్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన శ్రీయా నటిస్తోంది. మిథున్ చక్రవర్తి, పోసాని, ప్రియమణి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



