సెన్సార్ పూర్తి.. 'గాడ్ ఫాదర్' గ్రాండ్ ఎంట్రీ!
on Sep 23, 2022
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్'ను దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొంత ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటంతో ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదలవ్వడం కష్టమేనన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేవలం ఒక్క పోస్టర్ తో అన్ని ప్రచారాలకు చెక్ పెట్టింది మూవీ టీమ్.
తాజాగా 'గాడ్ ఫాదర్' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుందని తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ లభించిందని, చెప్పినట్లుగానే అక్టోబర్ 5నే సినిమా విడుదలవుతుందని స్పష్టం చేశారు. తాను ఆడించే రాజకీయ చదరంగం ఎలా ఉండబోతుందో చూస్తారు అన్నట్లుగా.. పంచె కట్టు, కళ్ళద్దాలతో చిరంజీవి నడిచి వస్తున్న పవర్ ఫుల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో సందడి చేయనుండగా.. నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా నిరవ్ షా, ఎడిటర్ గా మార్తాండ్ కె.వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
