ఘాటి మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆ సీన్ సినిమాకే హైలైట్..!
on Sep 4, 2025

వేదం తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో రూపొందిన మూవీ 'ఘాటి'. రేపు(సెప్టెంబర్ 5న) థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సెన్సార్ నుంచి 'ఘాటి'కి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ చిత్రం గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. (Ghaati Movie)
యాక్షన్, ఎమోషన్స్ ని మిళితం చేస్తూ 'ఘాటి' చిత్రాన్ని దర్శకుడు క్రిష్ అద్భుతంగా రూపొందించాడట. ఫస్ట్ హాప్ ఉత్కంఠభరితమైన యాక్షన్ తో సాగిందని తెలుస్తోంది. రైల్వే స్టేషన్ సీక్వెన్స్, గుహలో జరిగే ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయట. అలాగే, సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ హృదయాలను హత్తుకునేలా ఉన్నాయని అంటున్నారు. ఇక క్లైమాక్స్ అయితే గూస్‌బంప్స్ అని చెబుతున్నారు. ఈ సినిమాలో మొత్తం ఎనిమిది ఫైట్స్ ఉండగా, దేనికదే ప్రత్యేకంగా నిలిచాయట. యాక్షన్ సీన్స్ ఎంతగా అదిరిపోయాయో.. ఎమోషన్స్ కూడా అదే స్థాయిలో వర్కౌట్ అయినట్లు వినికిడి.
అనుష్క ఎంత గొప్ప నటినో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇప్పుడు 'ఘాటి'లోనూ శీలావతి పాత్రలో నటవిశ్వరూపం చూపించిందట. ఆమె యాక్టింగ్ సినిమాకే హైలైట్ గా నిలిచిందని టాక్. ముఖ్యంగా ఒక సన్నివేశంలో ప్రతినాయకులు శీలావతిని వివస్త్రను చేసి అవమానిస్తారని, ఆ సీన్ కంటతడి పెట్టించేలా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఆ సీన్ నిజంగా సినిమాలో ఉందో లేదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఉంటే మాత్రం.. అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ అలాంటి సీన్ చేయడం గ్రేట్ అనే చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



