నాని `జెంటిల్ మన్`కి ఐదేళ్ళు!
on Jun 17, 2021
నేచురల్ స్టార్ నానికి నటుడిగా జన్మనిచ్చిన ఘనత సెన్సిబుల్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటిది. `అష్టా చమ్మా`(2008)లో ఇద్దరు కథానాయకులలో ఒకరిగా నానిని పరిచయం చేసిన మోహనకృష్ణ.. దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత `జెంటిల్ మన్` చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో గౌతమ్, జయరామ్(జై)గా రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వడమే కాకుండా.. ఓ పాత్ర కోసం కాస్త నెగెటివ్ టచ్ ఇచ్చారు నాని. అతనికి జోడీగా నివేదా థామస్ (తెలుగులో కథానాయికగా ఇదే తొలి చిత్రం), సురభి నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ లో అవసరాల శ్రీనివాస్, వినయ్ వర్మ, ఆనంద్, శ్రీముఖి, తనికెళ్ళ భరణి, ప్రగతి, రోహిణి, వెన్నెల కిశోర్, సత్యం రాజేశ్, రమాప్రభ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సమకూర్చిన బాణీలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. పాటల్లో ``చలిగాలి చూడు``, ``గుస గుస లాడే``.. అటు వీనులవిందుగానూ, ఇటు కనువిందుగానూ రూపొందాయి. శ్రీదేవి మూవీస్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2016 జూన్ 17న విడుదలై జననీరాజనాలు అందుకున్న `జెంటిల్ మన్`.. నేటితో ఐదేళ్ళు పూర్తిచేసుకుంది.
Also Read