మెగాస్టార్ సినిమా రిలీజయ్యిందా!వివాదాస్పద వ్యాఖ్యలవుతాయేమో
on Apr 10, 2025
విభిన్నచిత్రాల దర్శకుడుగా 'గౌతమ్ వాసుదేవ్ మీనన్'(Gautham Vasudev Menon)కి సౌత్ సినీప్రేమికుల్లో మంచి పేరు ఉంది.రెండు దశాబ్దాల నుంచి ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమాలే అందుకు ఉదాహరణ.ఈ ఏడాది జనవరి 23 న మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి(Mammootty)గౌతమ్ కాంబోలో మిస్టరీ అండ్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన 'డొమినిక్ అండ్ లేడీస్ పర్స్'(Dominic and the ladies Purse)అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రీసెంట్ గా ఈ చిత్రం గురించి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు విభిన్నమైన కాన్సెప్ట్ తో'డొమినిక్ అండ్ లేడీస్ పర్స్' ని తెరకెక్కించాం.చూసిన వాళ్ళకి మూవీ బాగా నచ్చింది.కాకపోతే మేము మూవీని సరిగా ప్రమోట్ చేయలేదని అనిపిస్తుంది.ఎందుకంటే'డొమినిక్'వచ్చిందనే విషయం చాలా మందికి తెలియదు.ఇప్పటికి చాలా మంది మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని అడుగుతున్నారు. ఈ మాట బయట స్టేట్ వాళ్ళు అడిగితే పర్లేదు.కేరళ వాళ్లే అడుగుతున్నారు.ఇటివల కేరళ లోని ఒక ప్రాంతానికి వెళ్తే 'డొమినిక్' ఎప్పుడు రిలీజ్ అవుతుందని అడుగుతున్నారు.దాంతో చిరాకు వస్తుందని గౌతమ్ వాసుదేవ్ మీనన్ చెప్పుకొచ్చాడు.
డొమినిక్ అనే మాజీ పోలీసు అధికారి డిటెక్టివ్ గా మారిన తర్వాత పోగొట్టుకున్నపర్స్ యజమానిని కనుగొనే ఒక సాధారణ కేసు అప్పగించబడుతుంది.అయితే,ఆ పని త్వరగా తప్పిపోయిన వ్యక్తులు,హత్య, ఒక వేటగాడు మరియు నందిత అనే అదృశ్య నృత్యకారిణితో కూడిన సంక్లిష్టమైన రహస్యంగా మారుతుంది.డొమినిక్ గా మమ్మూట్టి అద్భుతంగా నటించగా మిగతా పాత్రలని పోషించిన వాళ్ళు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.మమ్మూట్టి నే ఈ మూవీని నిర్మించడం జరిగింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
