విజయ్ డేట్ పై కర్చీఫ్ వేసిన విశ్వక్ సేన్!
on Nov 27, 2023

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మొదట డిసెంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు వచ్చే వేసవి వాయిదా పడింది.
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాని 2024 మార్చి 8న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుండి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి యొక్క కథను వివరిస్తుంది. ఈ చిత్రం పట్ల విశ్వక్ సేన్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, 'సుట్టంలా సూసి' పాట ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి.
ప్రముఖ నటి అంజలి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అనిత్ మధాడి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
కాగా విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న 'ఫ్యామిలీ స్టార్' కూడా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా వేసవికి వాయిదా పడింది. దీనిని మార్చి 8 లేదా మార్చి 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ మార్చి 8న వస్తే.. విజయ్, విశ్వక్ సేన్ ల బాక్సాఫీస్ పోరు చూడనున్నాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



