మెగా షాక్.. 'గేమ్ ఛేంజర్' మళ్ళీ వాయిదా!
on Aug 5, 2024

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'గేమ్ ఛేంజర్' (Game Changer) మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల 'రాయన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుందని, డిసెంబర్ 20న విడుదల కానుందని న్యూస్ వినిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.
'ఇండియన్ 2' కారణంగా ఎప్పుడో మొదలైన 'గేమ్ ఛేంజర్' షూటింగ్ బాగా ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు ఈమధ్య రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్ పూర్తి చేసి.. బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న తన నెక్స్ట్ మూవీపైకి ఫోకస్ షిఫ్ట్ చేశాడు. దీంతో ఇక డిసెంబర్ లో 'గేమ్ ఛేంజర్' విడుదల కావడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కావడం అనుమానమే అంటున్నారు. ఇతర తారాగణంకి సంబంధించిన షూట్ ఇంకా కొంత మిగిలి ఉండటంతో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉండటంతో.. డిసెంబర్ లో రావడం కష్టమే అని చెబుతున్నారు. అంతేకాదు ఈ సినిమా ఏకంగా వచ్చే ఏడాది మార్చికి వాయిదా పడిందని టాక్. జనవరిలో చిరంజీవి 'విశ్వంభర' సహా పలు సినిమాలు ఉన్నాయి. ఇక ఫిబ్రవరిని అన్ సీజన్ గా భావిస్తారు. అందుకే మార్చికి పోస్ట్ పోన్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఈ వార్త నిజమైతే మెగా ఫ్యాన్స్ భారీ షాక్ అని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



