గలాట పాటలు విడుదల
on Mar 18, 2014
శ్రీ, హరిప్రియ జంటగా నటిస్తున్న తాజా చిత్రం "గలాట". చావలి రామాంజనేయులు సమర్పణలో డి.రాజేంద్రప్రసాద్ వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించారు. సునీల్ కశ్యప్ అందించిన పాటలు సోమవారం హైదరాబాదులో విడుదలయ్యాయి. ఎస్వీ కృష్ణారెడ్డి తొలి సీడీని ఆవిష్కరించారు.సురేందర్ రెడ్డి స్వీకరించారు. ఇందులో సాయికుమార్ ఓ ముఖ్య పాత్రలో నటించాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.